Home Blog Page 10

బాబుకు.. పవనుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ..

ఎవ్వరూ ఊహించని విధంగా పాకా సత్యనారాయణ పేరును రాజ్యసభకు ఖరారు చేసిన బీజేపీ..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హైకమాండ్ గా మారిన బీజేపీ.

ఏపీలో కూటమి ఏర్పడింది. ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీల అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించారు. ఇందులో ఏ పార్టీ పాత్ర ఎంత వరకు ఉందనే విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఏపీలోని కూటమిని రాజకీయంగా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది మాత్రం కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనేననే విషయం కచ్చితంగా చెప్పొచ్చు. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు కానీ.. ఎంపీ స్థానాలు కానీ ఖాళీ అయితే.. అక్కడ ఎవరిని భర్తీ చేయాలోననే అంశాన్ని తేల్చేది.. తేల్చి చెప్పేది మాత్రం బీజేపీనే. ఒకవేళ బీజేపీలోని కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు ఇబ్బంది అయినా సరే.. టీడీపీ లేదా జనసేన అన్ని మూసుకుని కూర్చొవాల్సిందే. అవును.. కచ్చితంగా మూసుకోవాల్సిందే. రాజ్యసభలో బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థిత్వాన్ని చూసిన తర్వాత ఇదే తరహా చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత.. పాకా సత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ పేరును.. ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని ఎవ్వరూ ఊహించ లేదు.

సరే ఎవరు పార్టీ అభ్యర్థిని వారు ఖరారు చేసుకుంటారు.. ఇందులో కూటమిలోని మిగిలిన పార్టీలకు వచ్చే ఇబ్బంది ఏంటనే చర్చ రావడం సహజం. కానీ గత చరిత్రతో పాటు.. రాజ్యసభ సీటు ఖరారు విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల అధినాయకత్వాలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీటు ఎవరి కోసం అనుకున్నారు.. చివరకు అది ఎక్కడకు చేరిందోననేది ఆసక్తికరంగా ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి విజయసాయి రెడ్డికే కేటాయిస్తారనే చర్చ జరిగింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డికి కాదు.. వేరే వ్యక్తులకు కేటాయిస్తారని

రకరకాల పేర్లూ వినిపించాయి. వాటిల్లో భాగంగా తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అలాగే మరో పేరు మందకృష్ణ మాదిగ రాజ్యసభకు వెళ్తారని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. రాజ్యసభ టిక్కెట్ విజయసాయి రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేని వారు ఈ రకమైన వాదనను తెర మీదకు తెచ్చారనే చర్చ జరిగినా.. రాజ్యసభ స్థానానికి అయితే విజయసాయి రెడ్డి.. లేదా అన్నామలై అదీ లేదా మంద కృష్ణ మాదిగలో ఎవ్వరో ఒకరికి దక్కుతుందని మాత్రం చాలా మంది బావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణకు ఆ స్థానాన్ని ఖరారు చేసింది.

ఇది టీడీపీ-జనసేనలకు చాలా ఇబ్బందికర అంశమేననే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పాకా సత్యనారాయణ పేరు ఎవ్వరూ ఊహించని అంశమైతే.. పాకా సత్యనారాయణ గత చరిత్ర కూడా దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. పాకా సత్యనారాయణ కావడానికి పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.. అందరూ ఆయన్ను గౌరవిస్తారు. కానీ ఆయనకు ఇంకో ముద్ర కూడా ఉంది. అదేటంటే.. పాకా సత్యనారాయణ చంద్రబాబు వ్యతిరేకి.. సోము వీర్రాజుకు సన్నిహితుడు అనే ముద్ర చాలా బలంగా ఉంది. ఇప్పుడు పాకా అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కూటమి ఏర్పడిన నాటి నుంచి బీజేపీ తాను అనుకున్న మాట నెరవేర్చుకుంటుందే తప్ప.. మిత్రపక్షాల మాటలను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ కారణంగానే జనసేన కొన్ని అసెంబ్లీ సీట్లను.. లోక్ సభ స్థానాలను తగ్గించుకుంది. ఇక టీడీపీ కూడా చాలా వరకు రాజీ పడింది. ఎన్నికల్లో రఘు రామకృష్ణం రాజుకు నరసాపురం టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ ససేమిరా అంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో రఘు రామకృష్ణం రాజును పార్టీలోకి చేర్చుకుని.. టిక్కెట్ ఇవ్వక తప్పని సరి పరిస్థితిలోకి వచ్చింది టీడీపీ. ఇంత చేస్తున్నా.. బీజేపీ మాత్రం తాను అనుకున్న వ్యవహరాలను తానిష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్లిపోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్సులో విపరీతంగా వినిపిస్తోంది.

చంద్రబాబు వ్యతిరేకులను ఏరి కొరి పదవులు ఇస్తున్నారని బీజేపీ గురించి ఏపీ పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. రఘు రామకృష్ణం రాజును కాదని.. నరసాపురం టిక్కెట్టును శ్రీనివాస వర్మకు కేటాయించారు. అక్కడితో ఆగకుండా సదురు వర్మకు కేంద్ర మంత్రి పదవి కేటాయించారు. అలాగే చంద్రబాబుతో చెడుగుడు ఆడుకున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు సోము సన్నిహితుడు.. చంద్రబాబు వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్న పాకా సత్యనారాయణకు టిక్కెట్ కేటాయించారు. ఇది సహజంగానే టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యవహరం.. చికాకు పరిచే వ్యవహరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. తమకిష్టం లేని వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నా.. వారిని వద్దు అని గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. బీజేపీని కాదంటే.. ఏం తేడా వస్తుందో.. ఎందుకొచ్చిన గొడవ అని ఇటు చంద్రబాబు.. అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీ విషయంలో రాజీ పడక తప్డం లేదనే చర్చ జరుగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు బీజేపీనే హైకమాండ్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తోంది.

పవన్ ప్రభావం చూపించగలుగుతున్నారా..?

పార్టీని గాడిలో పెట్టగలిగే స్థాయిలో పవన్ పని చేస్తున్నారా..?
కేడర్లో జోష్ నింపే ప్రయత్నాల్లో పవన్ ఎంత వరకు సక్సెస్ అవుతున్నారు..?

తాను స్థాపించిన పార్టీని ఓ కొలిక్కి తీసుకురావడానికి.. అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్ పదేళ్లు పట్టింది. అది కూడా తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే అది సాధ్యమైంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినా.. సరైన ఓట్లు రాలేదు.. సీట్లు కూడా రాలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే.. ఆ రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో కొంత.. రాజీతో కొంత అన్నట్టుగా కూటమి ఏర్పిడింది. 21 స్థానాల్లో పోటీ చేసి.. 21 స్థానాల్లోనూ గెలుపొందిన పరిస్థితి. ఇదో రకంగా సంచలనమే. 2024 ఎన్నికల్లో 21 స్థానాలను గెలిచారు. తాను కాకుండా.. మరో ఇద్దరికి మంత్రి పదవి ఇప్పించారు. ఇప్పటి వరకు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు వచ్చేలా చేశారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన ముఖ్య నేతలకు.. ప్రయార్టీ ఇవ్వాల్సిన వారికి పదవులు కట్టబెడుతూనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీ పటిష్టత గురించి.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం గురించి పవన్ కళ్యాణ్ ఎంత వరకు ఆలోచన చేస్తున్నారు.. దానికి సంబంధించిన ప్రణాళికలేమైనా ఉన్నాయా.. అంటే మాత్రం లేదనే సమాధానమే వస్తుంది.

టీడీపీ సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో కూడా పార్టీ కోసం పని చేసే వారు ఏర్పడ్డారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీకి కూడా సంస్థాగతంగా నెట్ వర్క్ ఉంది. అయితే జనసేన విషయానికొచ్చేసరికే ప్రధాన పార్టీలకున్న స్థాయిలో నెట్ వర్క్ జనసేనకు పెద్దగా ఉండడం లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీకి కేరాఫ్ అడ్రస్సుగా ఉంటున్న పరిస్థితి. ఓ కులం ఆధారంగా పార్టీని బిల్డప్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని స్వయంగా పవన్ కళ్యాణుకు తెలిసినా.. ఎందుకో పార్టీ

బలోపేతం మీద ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదు. ఒక్కసారి వ్యవస్థను ఏర్పాటు చేస్తే చాలు.. ఆ తర్వాత ఆ వ్యవస్థ పార్టీని ముందుకు నడిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు జనసేన అగ్ర నేతలు కానీ.. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కానీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే అంశంపై ఫోకస్ పెడుతున్న పరిస్థితి కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలోని ముఖ్య నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు ఇప్పించినంత మాత్రాన సరిపోదని.. జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పొలిటికల్ లుక్ రావాలంటే మరింత ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇక ఇప్పటికీ జనసేన అంటే కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీగానే కన్పిస్తోంది తప్ప.. గోదావరి గట్టు దాటి మాత్రం ముందుకు రాలేకపోతోంది జనసేన. గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉమ్మడి శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కో స్థానం వచ్చినా.. ఆ సమయంలో వైసీపీ మీదున్న వ్యతిరేకత వల్ల జనసేన అభ్యర్థులు గెలిచారే తప్ప.. వారి సొంత ఛరిష్మానో.. పార్టీ ఫ్లేవర్ వల్లో గెలవలేదు. అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పార్టీని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పదే పదే ప్రస్తావించడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లో తరుచూ పర్యటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఎన్నికల నాటికి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి గ్రామస్థాయిలో పార్టీకి ఓ మనిషంటూ ఉండాలి.. పార్టీ జెండాను భుజాన వేసుకునే వ్యక్తులు ప్రతి కుగ్రామంలోనూ కనీసం పది మందైనా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం కాగలదు. కానీ ప్రస్తుతం ఆ దిశగా జనసేన అడుగులు వేస్తున్నట్టు ఎంత మాత్రమూ కన్పించడం లేదు.

ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం.. లేదా ప్లీనరీలు చేసుకోవడంతో పాటు.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం.. సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సహా పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టకుంటే.. 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చినా.. 200 శాతం స్ట్రైక్

రేట్ వచ్చినా నిలబడదని అంటున్నారు. మరి ఈ దిశగా ప్రస్తుతానికైతే జనసేన అడుగులు పడుతున్నట్టు కన్పించడం లేదు. గాలికి గెలిచేశారని గేలి కాకుండా ఉండాలంటే.. ఈదురు గాలులకు చెక్కు చెదరనంతగా.. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ అన్నింటిని తట్టుకుని నిలబడే స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది పొలిటికల్ పండిట్స్ భావన.

పాపం పురందేశ్వరి..

ఏపీ బీజేపీకి నామ్ కే వాస్తే అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ తనయ..
హైకమాండ్ వద్ద పురందేశ్వరికి తగ్గిన ప్రాధాన్యం..
పురందేశ్వరి వ్యతిరేకులకు పార్టీలో పెద్ద పీట..

ఏపీ బీజేపీలో జరుగుతున్న కోల్డ్ వార్ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. కమలం పార్టీకి ఏపీలో చీఫ్ గా ఉన్న పురందేశ్వరిని ఇంటి పోరు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతోంది. తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటున్న దగ్గుపాటి పురందేశ్వరికి.. తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని లీడ్ చేయడం మాత్రం నానా ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ముందు తాను కోరుకున్న.. సిఫార్సు చేసిన అభ్యర్థులు అందరికీ చోటు కల్పించలేకపోయారు. ఆ తర్వాత పార్టీలోని పురందేశ్వరి వ్యతిరేకులకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట వేస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ వ్యవహరం అంతా చూస్తున్న వారికి బీజేపీ అధిష్టానం వద్ద పురందేశ్వరి ప్రాబల్యం అంతంత మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నరసాపురం ఎంపీ టిక్కెట్టును రఘు రామకృష్ణం రాజుకు ఇప్పించాలని పురందేశ్వరి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె పాచిక పారలేదు.. ఆయన స్థానంలో శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించారు. ఆ తర్వాత పురందేశ్వరికి కెబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినా.. ఆమెను పక్కకు నెట్టి శ్రీనివాస వర్మకు కెబినెట్లో చోటు కల్పించింది పార్టీ హైకమాండ్. అలాగే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ, రాజ్యసభల్లో కూడా ఆమె వేరే వారిని ప్రతిపాదించినా.. వారి మాటలను బేఖాతరు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా సోము వీర్రాజును ఎమ్మెల్సీ పదవికి.. పాకా సత్యనారాయణను రాజ్య సభకు ఎంపిక చేశారు కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు. ఇది ఓ రకంగా పురందేశ్వరికి షాక్ ఇచ్చినట్టేనని చెప్పాలి.

ఎన్నికల ముందు నుంచి పురందేశ్వరికి నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోము వీర్రాజుకు టిక్కెట్ ఇవ్వడమే కాకుండా.. సోము వీర్రాజు కోసం బీ-ఫారంను ఎయిర్ పోర్టులో పంపడం.. సోము వీర్రాజుకు అనుంగు అనుచరులుగా ముద్ర వేయించుకున్న సోము వీర్రాజు, పాక సత్యనారాయణ వంటి వారికి టిక్కెట్లు కేటాయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే.. కీలక నిర్ణయాల్లో.. తమ మాట నెగ్గించుకునే అంశాల్లో పురందేశ్వరి మాట కంటే.. సోము వీర్రాజుకే అర్హత ఏపీ బీజేపీలో కీలకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

కంచి కామకోటి పీఠం ఉత్తర పిఠాధిపతిగా ఏపీ వేద పండితుడు.

అన్నవరానికి చెందిన గణేశ్ శర్మకు కంచి పీఠం పిఠాధిపతిగా అవకాశం.
సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా పయ్యావుల కేశవ్.

కంచి కామకోటి పీఠం పిఠాధిపతిగా ఏపీకి చెందిన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన అన్నవరం పుణ్యక్షేత్రానికి చెందిన గణేశ్ శర్మ 71వ కంచికామకోటి పీఠం ఉత్తర పిఠాధిపతిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవం నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠం శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామిజీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతిథిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హజరయ్యారు. అలాగే టీటీడీ నుంచి ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

ప్రభుత్వాలకు సవాల్ గా మారుతోన్న పర్వ దినాలు..

ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కు బిక్కుమంటున్న ప్రభుత్వాలు..
దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు ప్రభుత్వాలకు నేర్పుతోందేంటీ..?
అమరావతి

పండుగలు.. పర్వదినాలు రాష్ట్ర ప్రభత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. పండుగలు.. పర్వదినాలు వచ్చాయంటే చాలా మంది ప్రజలు.. దేవుణ్ని దర్శించుకునేందుకు.. ఆయా రోజుల్లోని విశిష్టతల ఆధారంగా ఆయా ఆలయాలను సందర్శించడం అనేది ఆనవాయితీగా మారింది. గతంతో పోల్చుకుంటే భక్తి టూరిజం కూడా విపరీతంగా పెరిగింది. టెంపుల్ టూరిజం అంటే గతంలో వయోవృద్ధులు.. మహిళలు ఎక్కువగ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హిందూ ధర్మం మీద చాలా మంది రాన్రాను నమ్మకం పెరుగుతోంది. పర్వదినాల్లో తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం.. అది కూడా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శించుకోవాలనే విధానం పట్ల యువత కూడా ఆకర్షితులవుతున్నారు. దీంతో పుణ్య తిథుల్లో పండుగల సందర్భంలో దేవాలయాలన్ని కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో దేవాలయాల్లో ఏర్పాట్లు సరిగా చేయడంతోపాటు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా చూసుకోవడం ప్రభుత్వాలకు అతి పెద్ద సవాలుగా మారింది. పెద్ద ఎత్తున జనం తరలిరావడం వల్ల వాళ్లని కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి.. అధికారులకు కష్టతరంగా మారింది. మారుతున్న పరిస్ధితులు.. ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం లేదా దేవదాయ శాఖ పక్కా ఏర్పాట్లు చేయడమనేది ప్రభుత్వ ప్రధాన విధి. కానీ


పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతగా తీసుకోవడం లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగే అవకాశాలను ముందుగా అంచనా వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాగే దేవదాయ శాఖ విపరీతమైన నిర్లక్ష్యం కూడా మరో కారణంగా కన్పిస్తోంది.


ఇటీవల జరిగిన ఘటనల్లో ఇదే అంశం స్పష్టంగా కన్పిస్తోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన, సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనల్లో భక్తులు మృతి చెందడం.. అలాగే గత ప్రభుత్వ హయాంలోనూ జరిగిన వివిధ సంఘటనలు.. ఇక మహకుంభ్ సందర్భంగా జరిగిన ఘటనలు ఇలా చెప్పుకుంటూ ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అని లేకుండా.. అందరి వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. ప్రజలు టెంపుల్ టూరిజం పట్ల ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పండుగలు.. పర్వదినాలు.. పుష్కరాల వంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ బ్లూ ప్రింట్ రెడీ చేయాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.

జగన్ కు ఝలక్..

మద్యం స్కాం విషయమై త్వరలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసులిచ్చే ఛాన్స్..

మద్యం స్కాం లింకులు మాజీ సీఎం మెడకు చుట్టుకోవడం ఖాయమంటూ చర్చ.

ఏపీలో మద్యం స్కాం లింకులు అటు తిరిగి.. ఇటు తిరిగి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేరనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మర్రి చెట్టు ఊడలు భూమి లోపల చాలా దూరం వరకు విస్తరించినట్టుగా.. ఏపీలోని మద్యం కుంభంకోణం లింకులు కూడా అండర్ గ్రౌండులో చాలా దూరం విస్తరించాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్సులో విస్తృతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతానికైతే మద్యం స్కాంతో లింకులున్నాయని నాటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలను విచారణకు పిలిచారు. ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, బెవరెజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి వంటి వారితో పాటు.. నాడు బెవరెజెస్ కార్పోరేషనులో కీలకంగా వ్యవహరించిన సత్యకుమార్ వంటి వారిని విచారణకు పిలిచారు. వీరే కాకుండా.. తాడేపల్లి ప్యాలెస్సుతో లింకులున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో ఇంకొన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో మద్యం స్కాం లింకులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్లే సూచనలైతే స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ తరహా సూచనలు కన్పించడానికి కారణం లేకపోలేదనేది పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తున్న వాదన. ఆ కారణం మరేదో

కాదు.. విజయసాయిరెడ్డి.. ఆయనిచ్చిన వాంగ్మూలమేననేది ఇప్పుడు లేటెస్టుగా జరుగుతున్న చర్చ.

విజయసాయి రెడ్డి విచారణలో భాగంగా కొన్ని కీలకాంశాలు ప్రస్తావించారు. మద్యం స్కాం ఎలా జరిగిందనే విషయాలను చెప్పకనే చెప్పేశారు. ఈ విషయాన్ని వారో వీరో కాదు.. స్వయంగా విజయసాయి రెడ్డే మీడియా కాన్ఫరెన్సులో కొన్ని విషయాలను ప్రత్యక్షంగా.. ఇంకొన్ని విషయాలను పరోక్షంగా ప్రస్తావించేశారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం పాలసీ డిసైడ్ చేసే క్రమంలో తన నివాసంలో ఎవరెవరు సమావేశమైంది వివరించేశారు సాయిరెడ్డి. ఈ వైసీపీ మాజీ ఎంపీ చెప్పిన దాని ప్రకారం.. ఆ సమావేశంలో తనతో పాటు.. సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బెవరెజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, బెవరెజెస్ కార్పోరేషనులో ఉన్నతోద్యోగి సత్యకుమార్ పాల్గొన్నారు. ఇక్కడే అసలు కిటుకు ఉందని అంటున్నారు. మద్యం పాలసీ డిసైడ్ చేయాల్సింది.. అయితే సెక్రటేరీయేట్టులో.. లేదా మంత్రి ఛాంబరులో.. అదీ లేదంటే బెవరెజెస్ కార్పోరేషన్ ఎండీ ఆఫీసులో.. ఇక తప్పదనుకుంటే సదురు మంత్రి అధికారిక నివాసంలో సదరు కీలక సమావేశం జరగాలి. అలాంటింది ఆ మీటింగ్ విజయసాయి రెడ్డి సమక్షంలో జరిగిందంటే.. అందులోనూ ప్రైవేట్ వ్యక్తులు ఆ సమావేశంలో పాల్గొన్నారంటేనే స్కాంకు బీజాలు అక్కడే పడ్డాయనే విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పేసినట్టేనంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా నాటి సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే.

ఇదీ కాకుండా.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సహా.. ఇంకొందరు నిందితులు ఇచ్చిన వివరాలు బట్టి.. మద్యం స్కాం సొమ్ము.. నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహయకుడు కృష్ణమోహన్ రెడ్డికి వెళ్లాయి.. ఈ వ్యవహరమంతా నాటి సీఎంఓలో కీలకంగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ప్రస్తుతం ఈ మద్యం స్కాంను విచారిస్తున్న సిట్ కు సమాచారం అందింది. ఇవన్నీ చూస్తుంటే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే నోటీసులు అందడం ఖాయమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ లిక్కర్ స్కాం.. జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయమనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. దీంతో లిక్కర్ కిక్ ఎంత వరకు ఉంటుందో కానీ.. మద్యం స్కాంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో పొలిటికల్ కిక్ మాత్రం మహ రంజుగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.

నిర్మాణంలోనూ ఆయనే.. పునః నిర్మాణంలోనూ ఆయనే..

అమరావతి విషయంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ.
ప్రధాని శంకుస్థాపనలు చేయడం కాదు.. బీజేపీ ఓన్ చేసుకోవాలి.. అంటున్న నిపుణులు.
రాజధానికి వీలైనంతగా చట్టబద్దత కల్పించాలని డిమాండ్లు..

ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఏపీకి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా.. గ్రోత్ ఇంజిన్లుగా ఉండే రాజధాని అమరావతి.. పోలవరం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు మూలనపడ్డాయనే చెప్పాలి. ఓ విధంగా చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎప్పుడూ సీరియస్సుగా తీసుకోలేదనే చెప్పాలి. ఇక అమరావతి విషయంలో అయితే గత ప్రభుత్వ ధోరణి మరీ దారుణంగా ఉందనే విమర్శలున్నాయి. ఏకంగా రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ కావాల్సిన అమరావతిని ఆదిలో తుంచేసేలా గత పాలకులు వ్యవహరించారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

2024 ఎన్నికల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోసుకునే అవకాశం లభించింది. పోలవరం పనులు ఎప్పుడో పునః ప్రారంభం కాగా.. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా పునః ప్రారంభించారు. దీంట్లో భాగంగా సుమారు 58 వేల కోట్ల రూపాయల మేర పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రధాని కార్యక్రమంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతి పనులను ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోడీనే. ఆ రోజునే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి భారీ ఎత్తున ప్యాకేజీని ఆశించారు. కానీ మనీ (మట్టి-నీరు) ప్యాకేజీ ఇచ్చి.. చేతులు దులుపుకుని వెళ్లిపోయారు నరేంద్ర మోడీ. ఇప్పుడు అదే మోడీ అదే రాజధాని పనులను పునః ప్రారంభించారు. ఈసారి 58 వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. అయితే

వీటిల్లో ఎంత వరకు వర్కవుట్ అవుతాయి..? ఎంత వరకు వీటిని పూర్తి చేయగలరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి కేంద్రం నుంచి చాలా సాయం వివిధ రూపాల్లో అవసరం కానుంది. అది ఆర్థిక సాయం కావచ్చు.. మాట సాయం కావచ్చు.. ఇలా ఉంటాయి. ప్రస్తుతానికి కూటమి అంతా కలిసికట్టుగానే ఉంది.. కానీ గతంలో మాదిరిగా ఏదైనా తేడాలు వస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ.

ఈ క్రమంలో అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే రాజధానికి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలి. మళ్లీ రాజధాని విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా ఉండాలంటే.. కచ్చితంగా రాజధానికి.. అంటే అమరావతికి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇందుకు కేంద్రం తీసుకోవాల్సిన బాధ్యత చాలా ఉందనే చెప్పాలి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో.. బాధిత రాష్ట్రంగా ఉన్న ఏపీకి రాజధాని ఏర్పాటు చేసే విషయంలోనూ అంతే బాధ్యతగా వ్యవహరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా ఈ తరహా చర్యలు తీసుకోవడం ద్వారా అమరావతిని ఇక అజరామరం చేయడానికి కేంద్రం చొరవ చూపినట్టు అవుతుంది. ఇది జరగాలంటే.. అమరావతి ప్రాంతాన్ని జాతీయ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో నాటి పాలకులు అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటే.. కేంద్రం దాదాపు కళ్లు మూసుకుపోయినట్టే వ్యవహరించిందని చెప్పాలి. పైగా కొందరు బీజేపీ నేతలు అయితే.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన రచ్చను సమర్థించినట్టుగా మాట్లాడారు. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకూడదని గుర్తు చేస్తున్నారు.

రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో పీజీ చదువుతున్న తెలంగాణ వైద్యుడు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానిక నివేదికల ప్రకారం, 26 ఏళ్ల డాక్టర్ రవి కుమార్ ఆదివారం రాయ్‌పూర్‌లోని హర్షిత్ టవర్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించాడు. అతను సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లోని అతని జూనియర్ సహచరులు ఆందోళన చెంది అతనికి ఫోన్ చేయడం ప్రారంభించారు. అనేక ప్రయత్నాలు చేసినా సమాధానం లేకపోవడంతో, వారు అతని ఫ్లాట్‌కు వెళ్లి, అక్కడ అతని నిర్జీవ మృతదేహాన్ని కనుగొన్నారు.

Hyderabad: వైద్య వృత్తిపై తీవ్ర పని ఒత్తిడి ప్రభావం చూపుతోందని ఆరోపించే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లోని రిమ్స్ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి, రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పిజి చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) వైద్య విద్యార్థి డాక్టర్ రవి కుమార్ ఆశమోని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానిక నివేదికల ప్రకారం, 26 ఏళ్ల డాక్టర్ రవి కుమార్ ఆదివారం రాయ్‌పూర్‌లోని హర్షిత్ టవర్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించారు.

కూడా చదవండి


అతను సమయానికి ఆసుపత్రికి చేరుకోకపోవడంతో ఎయిమ్స్ రాయ్‌పూర్‌లోని అతని జూనియర్ వైద్యులు అతనికి ఫోన్ చేయడం ప్రారంభించారు. అనేక కాల్స్‌కు సమాధానం లేకపోవడంతో, వారు అతని ఫ్లాట్‌కు చేరుకున్నారు, కానీ అతని నిర్జీవ మృతదేహాన్ని కనుగొన్నారు.

డాక్టర్ రవి కుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో తీవ్రమైన పని ఒత్తిడి గురించి మాట్లాడిన సూసైడ్ నోట్‌ను కూడా ఉంచాడని నివేదికలు సూచించాయి.

ఈ సంఘటన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రవి కుమార్‌తో కలిసి పనిచేసిన, చదువుకున్న విషయాలను ప్రేమగా గుర్తుచేసుకున్న సీనియర్ రెసిడెంట్లు మరియు MBBS సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

"మా ప్రియమైన డాక్టర్ రవి కుమార్ ఆశమోని మరణవార్త విన్నప్పుడు మాకు కలిగిన బాధను వ్యక్తపరచడానికి పదాలు సరిపోవు. డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ నుండి నిరంతర వేధింపులు మరియు భరించలేని పని ఒత్తిడి కారణంగా అతను మూసివేతకు దారితీస్తుందని భావించిన ఏకైక చర్య అంటే ఆత్మహత్య" అని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TSRDA) సభ్యులు అన్నారు.

రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లోని బాధ్యతాయుతమైన అధికారులపై త్వరితంగా మరియు నిష్పాక్షికంగా మరియు సరైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ రెసిడెంట్లు అధికారులు నిందితులను/నేరస్థులను త్వరగా శిక్షించాలని మరియు దుఃఖంలో ఉన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇంతలో, జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ జాతీయ అధ్యక్షుడు ఐఎంఏ డాక్టర్ ధ్రువ్ చౌధన్ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. "వైద్యులలో నిరాశ మరియు ఆత్మహత్యల కేసులను జాతీయ వైద్య కమిషన్ విచారించడానికి ఎంత సమయం పడుతుంది? అటువంటి కేసులు జరిగినప్పుడు సంబంధిత విభాగం మూలకారణాన్ని కనుగొనడానికి దర్యాప్తును ఎలా ఎదుర్కోదు?" డాక్టర్ చౌహాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన ప్రతిచర్యను పోస్ట్ చేశారు.

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో బావమరిది చేతిలో వ్యక్తి హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు మొహమ్మద్ ఇలియాస్ మరియు అనుమానితుడు అబ్దుల్ సత్తార్ మధ్య ఒక చిన్న విషయంపై వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. సత్తార్ కత్తిని తీసుకుని పదే పదే పొడిచాడని, ఇలియాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను కుప్పకూలిపోయాడు.

Hyderabad: బంజారా హిల్స్‌లోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో మునుపటి శత్రుత్వం కారణంగా ఒక వ్యక్తిని అతని బావమరిది హత్య చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు మొహమ్మద్ ఇలియాస్ మరియు అనుమానితుడు అబ్దుల్ సత్తార్ మధ్య ఒక చిన్న విషయంపై వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. సత్తార్ కత్తిని తీసుకుని పదే పదే ఇలియాస్‌ను పొడిచాడని, అతని శరీరంపై అనేక తీవ్ర గాయాలు కావడంతో అతను కుప్పకూలిపోయాడు.

వెంటనే అతన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరియు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నితిన్ గడ్కరీ పర్యటనకు ముందు, ఆసిఫాబాద్‌లో డ్రైనేజీ సౌకర్యం కోరుతూ స్థానికులు నిరసన చేపట్టారు.

గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల నుండి మురుగునీరు కూడా ఆ ప్రాంతంలో నిలిచిపోతోంది.

Kumram Bheem Asifabad: వాంకిడి మండల కేంద్రంలో సోమవారం కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు నెట్‌వర్క్ ప్రారంభోత్సవానికి ముందు సైడ్ డ్రెయిన్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు NH 363పై ధర్నా చేశారు.

వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారిని ఆనుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో జాప్యం కారణంగా తాము అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నామని ఆందోళన చేస్తున్న స్థానికులు తెలిపారు. గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో మునిగిపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల నుండి మురుగునీరు కూడా ఆ ప్రాంతంలో నిలిచిపోతోంది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టుకుని, స్థానికులు ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థ కోసం చర్యలు తీసుకోవాలని మరియు తమకు కలిగే అసౌకర్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. 2024లో దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేసి ఈ రోడ్డును నిర్మించారని, కానీ ఇప్పటివరకు సైడ్ డ్రెయిన్లు నిర్మించలేదని వారు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించినందుకు స్థానిక బిజెపి నాయకులను వారు నిందించారు.

మంత్రి పర్యటనకు సంబంధించి NHపై ధర్నా చేసినందుకు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కాఘజ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించే ముందు గడ్కరీ మంచిర్యాల మరియు వాంకిడి మధ్య 94 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు.